![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -24 లో..... శంకర్ చనిపోవడంతో జానూ ఇంకా షాక్ లోనే ఉంటుంది. అప్పుడే ఏం తెలియనట్టు సింహాద్రి వచ్చి.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయావని ఏడ్చినట్లు యాక్టింగ్ చేస్తాడు. నేను పెళ్లి కూతురులాగా రెడి అయ్యాను చూడు నాన్న అంటూ నందు ఏడుస్తుంది. అప్పుడే శాంతి వస్తుంది. నేను శాపనార్థాలు పెట్టాను.. నన్ను క్షమించురా ఈ అక్కని వదిలేసి ఎందుకు వెళ్ళావ్ రా అని శాంతి ఏడుస్తుంది. అతనికి కొత్త డ్రెస్ ఉంటే ఇవ్వండి అని అక్కడున్న వాళ్ళు అనగానే జానూ వాళ్ళ నాన్న కోసం తీసుకున్న డ్రెస్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది.
ఆ తర్వాత శంకర్ బాడీని తీసుకొని వెళ్తారు. నువ్వు మేనల్లుడివి కదా నువ్వే తలకొరివి పెట్టాలని మురళీతో అక్కడున్న వాళ్ళు చెప్తారు. దాంతో మురళి తలకొరివి పెట్టడానికి సిద్ధమవుతాడు. అప్పుడే జానూ ఆపమని చెప్తుంది. మా నాన్నకి మేమే తలకొరివి పెడుతాం.. మేం అంటే మా నాన్నకి చాలా ఇష్టమని జానూ ఏడుస్తుంది. అవును వాళ్లనే పెట్టనివ్వండి అని మురళి అంటాడు. అలా ఆడపిల్లలు పెట్టొద్దు అమ్మా. శాస్త్రాలు ఒప్పుకోవని సింహాద్రి అంటుంటే అవన్నీ మనం పెట్టుకున్న శాస్త్రాలు వాళ్ళని పెట్టనివ్వండి మావయ్య అని సూర్య అంటాడు. దాంతో నలుగురు కూతుళ్లు తన తండ్రికి కొరివి పెడతారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక శంకర్ ఫోటో దగ్గర కూర్చొని అందరు ఏడుస్తారు. మరొకవైపు పెళ్లికి చేసిన ఏర్పాట్లకి చావుకి చేసిన ఏర్పాట్లకు సూర్య, మురళి కలిసి అందరికి డబ్బు ఇస్తారు.
ఆ తర్వాత శంకర్ ఫోటో దగ్గరికి వచ్చి సింహాద్రి ఏడుస్తాడు. నాతో మాట్లాడకుండా ఒక్క రోజు కూడా ఉండేవాడివి కాదు.. ఎందుకు ఇలా చేసావని సింహద్రి యాక్టింగ్ చేస్తాడు. నా తమ్ముడు చనిపోలేదు.. చంపేశారని శాంతి అనగానే సింహాద్రి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో జానూ ఒంటరిగా వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ.. నాన్న అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే శంకర్ ఆత్మరూపంలో జానూ దగ్గరికి వచ్చి ఇప్పుడు నా బాధ్యత నువ్వు తీసుకొవాలి.. అలా తీసుకుంటానని మాటివ్వమని శంకర్ అనగానే జానూ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |